రవివర్మ, సంజనాసింగ్, ఆలోక్‌జైన్, మనీషా దేవ్, జీవ, విజయరంగరాజు, సంధ్యశ్రీ, నర్సింగ్ యాదవ్, జబర్దస్త్ అప్పారావు ప్రధానపాత్రధారులుగా రూపొందిన చిత్రం బుల్లెట్. చౌడప్ప దర్శకుడు. ఎం.సి.రావు, జి.గోపాల్, ఎం.వి.మల్లిఖార్జునరావు, కోనూరి సుబ్రహ్మణ్యం, మణి నిర్మాతలు. మార్చి 8న విడుదలైన ఈ సినిమా 50రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో 50రోజుల వేడుకను నిర్వహించారు. దర్శకుడు సముద్ర, నిర్మాత శోభారాణి అతిథులుగా హాజరై చిత్రయూనిట్‌కు అభినందనలు అందించారు. సక్సెస్ చేసిన అందరి కీ పేరుపేరున ధన్యవాదాలని హీరో రవివర్మ అన్నారు. మంచి సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారని మరోమా రు రుజువైందని దర్శకుడు ఆనందం వ్యక్తం చేశారు. దర్శకుడు చౌడప్ప పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని నిర్మాతలు అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ అంతా పాల్గొన్నారు.