అమెరికా తన వద్ద ఉన్న ప్యాట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ క్షిపణుల ను ఉక్రెయిన్‌కు సరఫరా చేసేందుకు సిద్ధం గా ఉన్నట్లు రక్షణ కార్యాలయం పెంటగాన్ వెల్లడించింది. కొత్త మిలిటరీ ప్యాకేజీ కింద ఆ ఆయుధాలను సరఫరా చేయనున్నది. ఉక్రెయిన్‌కు 60 బిలియన్ల డాలర్ల సాయాన్ని అందించేందుకు ఇటీవల అమెరికా ఉభయసభలు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దాంట్లో ఆరు బిలియన్ల డాలర్లు ప్యాట్రియాట్ మిస్సైళ్ల కోసం ఖర్చు చేయనున్నారు. అయితే మిస్సైళ్లను వదిలేందుకు కావాల్సిన ప్యాట్రియాట్ సిస్టమ్స్‌ను మాత్రం సరఫరా చేయడం లేదని రక్షణశాఖ మంత్రి లాయిడ్ ఆస్టిన్ తెలిపారు. రష్యా నుంచి వైమానిక దాడులు ఎక్కు వ అవుతున్నాయని, తమ ప్రాణాలను కాపాడుకునేందుకు అర్జెంట్‌గా ప్యాట్రియాట్ మిస్సైళ్లు అవసరమని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోల్డోమిర్ జెలెన్‌స్కీ తెలిపారు.
