ఎస్.శంకర్ దర్శకత్వంలో ప్రభుదేవా హీరోగా 30ఏళ్ల క్రితం విడుదలైన ప్రేమికుడు సినిమా ఓ సంచలనం. యువతని ఉర్రూతలూగించిన సినిమా ఇది. శంకర్ దర్శకత్వ ప్రౌఢి, ప్రభుదేవ డాన్సులు, నగ్మ అందచందా లు, నిర్మాత కేటీ కుంజుమన్ భారీ నిర్మాణ విలువలు అన్నింటినీ మించి ఏఆర్ రెహమాన్ స్వరాలు ప్రేక్షకుల ను విశేషంగా అలరించాయి. విశేషమేంటంటే మే 1న మళ్లీ ప్రేమికుడు థియేటర్లలోకి రానున్నాడు. నేటి యువతని కూడా టార్గెట్ చేయనున్నాడు.
రమణ, మురళీధర్ ఈ రీరిలీజ్‌కు నిర్మాతలు. మే 1న 300లకు పైగా థియేటర్‌లలో ఘనంగా ప్రేమికుడు ని విడుదల చేయనున్నట్టు నిర్మాతలు తెలిపారు. బుకింగ్స్ ఓపెన్ అవ్వడంతో ప్రజలనుండి అద్భుతమైన స్పందన వస్తున్నదని, ఈ సినిమా థియేటర్ ఎక్స్‌పీరియన్స్ కోసం నేటి యువత కూడా ఎదురు చూస్తున్న దని వారు అన్నారు. ఇంకా నిర్మాత శోభారాణి కూడా మాట్లాడారు. ఎస్పీబాలసుబ్రహ్మణ్యం, గిరీశ్‌కర్నాడ్, వడివేలు, రఘువరన్ ఇందులో కీలక పాత్రలు పోషించిన విషయం తెలిసిందే.