కంట్రీ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ( సీఓటీఏ) ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది ఉత్సవాలు జరిగాయి. విలెన్ హాల్ సోషల్ క్లబ్, కొవెంట్రీ వెన్యూలో సీఓటీఏ తొమ్మిదో వార్షికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం, సన్మానాలు, రిటర్న్ గిఫ్ట్స్, ఆటలు, పాటలు, డ్యాన్స్, డీజే, విందు భోజనం తదితర కార్యక్రమాలు జరిగాయి. 1957`2024 వరకు తెలుగు చలన చిత్రాల టైమ్ మెషీన్ అనే కాన్సెప్ట్‌తో నిర్వహించిన ఈ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది.
సీఓటీఏ సభ్యులు మాట్లాడుతూ తెలుగు వారందరినీ ఒక తాటి పైకి తీసుకురావాలనే మంచి ఉద్దేశంతో ఈ అసోసియేషన్‌ను స్థాపించి విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. ఉగాది ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం ఆనందంగా ఉందని చెప్పిన సభ్యులు, ఈ సందర్భంగా ప్రతి ఒక్క తెలుగు కుటుం బానికి శుభాభినందనలు తెలిపారు.సన్మాన కార్యక్రమంలో భాగంగా ఏటా తెలుగు సమాజంలో సమాజ సేవ చేసిన వారిని సత్కరిస్తుంటారు. యువ తెలుగు సమాజానికి రోల్ మోడల్‌గా నిలిచిన డా.చంద్ర కన్నెగంటి సీబీఈ ని కొవెంట్రీ తెలుగు వైద్యుల బృందం ఘనంగా సత్కరించింది. కొవెంట్రీ డిప్యూటీ మేయర్ కూడా సత్కరించారు. ప్రముఖ నటుడు షాయాజీ షిండే లైవ్ కాల్ ప్రొడెక్టర్ డిస్‌ప్లేలో సీఓటీఏ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఉత్సవాలలో కొవెంట్రీ, మిడ్‌లాండ్స్ చుట్టుపక్కల ప్రాంతాల నుండి కుటుంబ సమేతంగా సభ్యులు హాజరయ్యారు.