Namaste NRI

అమెరికాలో మరోసారి కలకలం

అమెరికాలో మరోసారి కాల్పుల  కలకలం సృష్టించాయి. ఫ్లోరిడా రాష్ట్రంలోని శాన్‌ఫోర్డ్‌లో ఓ పార్టీ లో 16 ఏళ్ల బాలుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో 10 మంది గాయపడ్డారు. ఓర్లాండోకు ఉత్తరాన 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న శాన్‌ఫోర్డ్‌ లోని కాబానా లైవ్‌ లో అర్ధరాత్రి ప్రదర్శన కోసం పెద్ద ఎత్తున జనాలు గుమిగూడారు. ఆ సమయంలో అక్కడ వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో 16 ఏళ్ల బాలుడు గన్‌తో కాల్పులకు తెగ బడ్డాడు. ఈ ఘటనలో సుమారు 10 మంది గాయపడినట్లు సెమినోల్‌ కౌంటీ షెరీఫ్‌ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. గాయపడిన వారికి ఎలాంటి ప్రాణాపాయం లేదని వెల్లడించింది. ఈ ఘటనలో కాల్పులకు పాల్పడి న 16 ఏళ్ల యువకుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events