Skip to main content

Namaste NRI

అశోక్ గల్లా దేవకీ నందన వాసుదేవ ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్

గల్లా అశోక్‌ నటిస్తున్న తాజా చిత్రం దేవకీ నందన వాసుదేవ. వారణాసి మానస కథానాయిక. అర్జున్‌ జంధ్యాల దర్శకుడు. సోమినేని బాలకృష్ణ నిర్మాత. ఈ సినిమా నిర్మాణం చివరి దశకు చేరుకుంది. మేకర్స్‌ ప్రమోషన్‌ స్టార్ట్‌ చేశారు. అందులో భాగంగా ఏమయ్యిందే గుండెకూ పాట ప్రోమోను విడుదల చేశారు. భీమ్స్‌ సిసిరోలియో ఆకట్టుకునే ట్యూన్‌తో ఈ పాటను స్వరపరిచారని, హీరోకు హీరోయిన్‌పై ఉండే ఆరాధానను వ్యక్తం చేసేలా ఈ పాట సాగుతుందని, ఈ పాటలో గల్లా అశోక్‌ అనందంగా కనిపిస్తుంటే, వారణాసి మానస అందంగా కనిపిస్తున్న దనీ, పూర్తి పాటను మే 3న విడుదల చేస్తామని మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: సాయిమాధవ్‌ బుర్రా, కెమెరా: ప్రసాద్‌ మూరెళ్ల.

Social Share Spread Message

Latest News