తెలుగుతేజం చిన్నారి కలశనాయుడు అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. పదకొండేండ్లకే గౌరవ డాక్టరేట్‌కు ఎంపికైంది. కలశ సామాజికసేవా కార్యక్రమాలను గుర్తించిన యూనైటెడ్ నేషన్స్ గ్లోబల్ పీస్ కౌన్సిల్ ఇటీవలే గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది. ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలిగా, సమాజ సేవకురాలిగా కలశ గుర్తింపు తెచ్చుకుంది. అక్షర కలశ సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు, మహిళలకు అవార్డులివ్వడంతో పాటు గ్రీన్న్ల్రను నిర్వహించింది. గతంలో కలశ బ్రిటీష్ పార్లమెంట్‌నుద్దేశించి రెండు నిమిషాలు ప్రసంగించింది.