Namaste NRI

రెడ్‌లైన్ దాటుతున్నారు…భారత్‌ వార్నింగ్‌

నిజ్జర్ హత్య కేసు విషయంలో కెనడాతో దౌత్య విభేదాలు కొనసాగుతున్న వేళ ఒట్టావా లోని భారత హైకమిషన ర్ సంజయ్ కుమార్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక్కడి సిక్కు వేర్పాటువాద గ్రూప్‌లు రెడ్‌లైన్ దాటుతున్నా రని హెచ్చరించారు. కెనడా గడ్డ నుంచి భారత భద్రతకు పొండి ఉన్న ముప్పు గురించే తన ప్రధాన ఆందోళన అని అన్నారు. నిజ్జర్ హత్య కేసులో ముగ్గురు భారతీయులను ఇటీవల కెనడా పోలీస్‌లు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

ఈ పరిణామాలపై సంజయ్ వర్మ తొలిసారిగా స్పందించారు. ద్వంద్వ జాతీయతను భారత్ ఎన్నటికీ గుర్తించదు. ఎవరైనా వలస వస్తే వారిని విదేశీయులు గానే పరిగణిస్తాం. భారత ప్రాదేశిక సమగ్రతపై దుష్టశక్తుల కన్ను పడింది. తమ స్వస్థలాన్ని భారత్ నుంచి విడదీయాలని చూస్తున్న కొందరు , తమ చర్యలతో రెడ్‌లైన్ దాటుతున్నారు. దీన్ని న్యూఢిల్లీ దేశ భద్రతకు ముప్పుగానే పరిగణించి నిర్ణయాలు తీసుకుంటుంది జాగ్రత్త అని హెచ్చరించారు.

Social Share Spread Message

Latest News