బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. బ్రహ్మ ఆనందం పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రం ద్వారా ఆర్‌వీఎస్ నిఖిల్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. స్వధర్మ్ ఎంటర్‌టైన్ మెంట్ పతాకంపై రాహుల్ యాదవ్ నక్కా నిర్మించనున్నారు. వెన్నెల కిషోర్, ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా తాలూకు ప్రీలుక్ పోస్టర్‌తో పాటు అనౌన్స్‌మెంట్ వీడియోను విడుదల చేశారు. ఇందులో బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ మధ్య జరిగే సరదా సంభాషణ అందరిని ఆకట్టుకుంటున్నది.
ఈ సినిమాలో బ్రహ్మానందం, రాజా గౌతమ్, తాత, మనవళ్లుగా కనిపించబోతున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను త్వరలో ప్రారంభిస్తామని, డిసెంబర్ 6న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: మితేష్ పర్వతనేని, సంగీతం: శాండిల్య పిసపాటి, ఆర్ట్: క్రాంతి ప్రియం, రచన-దర్శకత్వం: ఆర్‌వీఎస్ నిఖిల్.