Namaste NRI

ఏపీలో పోలింగ్‌కు పోటెత్తిన ఎన్నారైలు

ఆంధ్రప్రదేశ్  లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ చెదురుమదురు ఘటనల మినహా ప్రశాంతంగా  ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటల నుంచి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు భారీ సంఖ్యలో ఓటర్లు తరలి వస్తున్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అమెరికాతో పాటు పలు దేశాలలో నివసిస్తున్న ప్రవాసాంధ్రులు, ఎన్నారై టీడీపీ నేతలు ఏపీకి భారీ సంఖ్యలో తరలివచ్చారు. వారంతా తమ తమ స్వస్థలాలలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ క్రమంలోనే ఎన్నారై టీడీపీ మీడియా కో-ఆర్డినేటర్ సాగర్ దొడ్డపనేని తన ఓటు హక్కును ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వినియోగించుకున్నారు.

 కేవలం ఏపీ భవిష్యత్తు బాగుండాలని, మరోసారి బాబుగారిని సీఎం చేయాలని అమెరికా నుంచి ఆంధ్రాకు ఓటు వేసేందుకు ప్రత్యేకంగా వచ్చామని తెలిపారు. ఏపీలో ఉన్న ఓటర్లంతా తమ ఓటు హక్కును వినియో గించుకోవాలని టీడీపీ ఎన్నారై నేతలు పిలుపునిచ్చారు. మేము ఓటు వేశాం..మరి మీరు? అంటూ తమ వేలికి ఇంక్ గుర్తు ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలి రావాలని, సమయం లేదు మిత్రమా..రణమా..శరణమా అంటూ ఓటరు మహాశయులకు పిలుపునిస్తున్నారు.

ఈసారి ఎన్నికల్లో పలు దేశాల నుంచి ఎన్నారైలు భారీ సంఖ్యలో తరలి రావడం విశేషం. ముఖ్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి మద్దతుగా టీడీపీ ఎన్నారై నేతలు పోలింగ్ రోజున ఓటు వేయడమే కాకుండా టీడీపీ కూటమిని గెలిపించాలని, చంద్రబాబును మరోసారి ముఖ్యమంత్రిని చేస్తేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుంద ని ఓటర్లును చైతన్యపరుస్తూ ముమ్మరంగా ప్రచారం ప్రచారం చేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress