లోక్సభ ఎన్నికల ప్రక్రియలో ఇవాళ ఆరో విడత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. దేశంలోని 6 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్సభ నియోజకవర్గాల్లో శనివారం పోలింగ్ జరుగుతున్నది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్ర 5 గంటల వరకు కొనసాగనుంది. కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది. ఉదయం పోలింగ్ ప్రారంభానికి ముందే ఓటర్లు పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరారు.
ఆరో విడత పోలింగ్ జరగనున్న రాష్ట్రాల జాబితాలో బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాలు ఉన్నాయి. బీహార్లో 8, హరియాణాలో 10, జమ్ముకశ్మీర్లో 1, జార్ఖండ్లో 4, ఢిల్లీలో 7, ఒడిశాలో 6, యూపీలో 14, బెంగాల్లో 8 స్థానాల్లో పోలింగ్ జరగనుంది.