Namaste NRI

ఒకవేళ ఆయన రాకపోతే..పుతిన్‌కు స్వాగతం పలికినట్లే!

ఉక్రెయిన్‌ కోసం ఈ జూన్‌లో శిఖరాగ్ర శాంతి సదస్సు నిర్వహణకు స్విట్జర్లాండ్‌ సిద్ధమైంది. అయితే, ఈ సమావేశానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ హాజరవుతారా? లేదా? అనేది తేలాల్సి ఉంది. ఈ వ్యవహారంపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. బైడెన్‌ గైర్హాజరు కావడమనేది రష్యా అధినేత పుతిన్‌ కు పరోక్షంగా ఘన స్వాగతం పలికినట్లేనని పేర్కొన్నారు.

ఈ శిఖరాగ్ర సదస్సుకు అనేక మంది ప్రపంచ నేతలు హాజరవుతున్నారు. బైడెన్‌ కూడా పాల్గొనడం అవసరం. ఒకవేళ ఆయన రాకపోతే, అది పుతిన్‌ను ప్రశంసించినట్లు అవుతుంది. వ్యక్తిగతంగా స్టాండిరగ్‌ ఒవేషన్‌ ఇచ్చి నట్టే అని బ్రెస్సెల్స్‌ పర్యటన సందర్భంగా జెలెన్‌స్కీ వ్యాఖ్యానించారు.  ఈ శిఖరాగ్ర సమావేశాన్ని దాటవేసే దేశాలు ఉక్రెయిన్‌పై రష్యా చేస్తోన్న యుద్ధంతో సంతృప్తి చెందినట్టేనని వ్యాఖ్యానించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress