Skip to main content

Namaste NRI

 బే ఏరియాలో ఘనంగా ఎన్టీఆర్‌ జయంతి ఉత్సవాలు

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలను బే ఏరియాలో జయరాం కోమటి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్‌ అభిమానులు, టీడీపీ  నాయకులు హాజరై ఘనంగా నివాళులు అర్పించారు.  ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పార్టీ విజయం కోసం బే ఏరియా నుంచి ఎంతోమంది ఎన్నారైలు ఆంధ్రప్రదేశ్‌ వెళ్లి పలు  నియోజక వర్గాల్లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వారు తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తుందని, కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు భరత్‌ ముప్పిరాళ్ల, రవి కిరణ్‌, నరహరి మార్నేని, హరి బాబు బొప్పూడి, వంశీ కృష్ణ నేలకుదిటి, రామ్మోహన్‌, భక్త భల్లా, వెంకట్‌ కోగంటి, సుబ్బ యంత్ర, శ్రీనివాస్‌ వల్లూరిపల్లి, విజయ్‌ గుమ్మడి, సతీశ్‌ అంబటి, హరి సన్నిధి, వెంకట్‌ అడుసుమల్లి, లియోన్‌ రెడ్డి బోయపాటి, వెంకట్‌ మద్దిపాటి, సుధీర్‌ ఉన్నం, వెంకట్‌ జెట్టి  పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News