తీవ్రమైన పెనుగాలులకు ఓ విమానం పక్కకు జరిగింది. ఈ షాకింగ్ ఘటన అమెరికాలోని డల్లాస్ నగరంలో చోటు చేసుకుంది. అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో భారీ ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. విమాన రాక పోకలు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో డల్లాస్ ఫోర్ట్ వర్త్ ఎయిర్‌పోర్ట్ లో సుమారు 700 విమానాలను ఎక్కడికక్కడ నిలిపివేశారు. ఆ సమయంలో శక్తివంతమైన గాలుల కారణంగా రన్‌వేపై పార్క్ చేసిన అమెరికన్ ఎయిర్‌లైన్స్ కు చెందిన బోయింగ్ 737-800 విమానం ఒక్కసారిగా పక్కకు జరిగింది.