
ఐక్యరాజ్యసమితి శాంతిపరిరక్షణ దళంగా సూడాన్‌లో ఉన్న భారత సైనికులు స్నేహపూర్వకంగా జరిగిన టగ్ ఆఫ్ వార్ ఆటలో తమ సత్తా చాటాను. చైనా సైనికులను ఓడించారు. ఈ వీడియోను భారత ఆర్మీ అధికారులు కూడా ధ్రువీకరించారు. సూడాన్‌లో శాంతి పరిరక్షణ నిమిత్తం వెళ్లిన భారత్, చైనా సైనికులు స్నేహపూర్వకంగా టగ్ ఆఫ్ వార్ ఆటను ఆడారు. సూడాన్‌లో శాంతి పరిరక్షణ నిమిత్తం వెళ్లిన భారత్, చైనా సైనికులు స్నేహపూర్వకంగా టగ్ ఆఫ్ వార్‌ను ఆడారు. భారత సైన్యం మరోసారి తమ శక్తిని చాటింది. పట్టుదలతో కలిసికట్టుగా ఏదైనా సాధించగలమని నిరూపించింది. బృందస్ఫూర్తిని, పోటీతత్వాన్ని ప్రదర్శించింది.
