ఆఫ్ఘనిస్థాన్‌లో అధికారాన్ని హస్తగతం చేసుకున్న తాలిబన్లతో చైనాకే అసలైన సమస్య అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. అందుకే వారు పరిష్కారం కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారని తనకు తెలుసునని తెలిపారు. తాలిబన్లతో అసలు సమస్య చైనాకే ఉంది. అందువల్ల దానిని పరిష్కరించుకునేందుకు తాలిబన్లతో ఏవో ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పాకిస్థాన్, రష్యా, ఇరాన్ లానే చైనా కూడా ఈ ప్రయత్నాలు చేస్తున్నది. ఇప్పుడేం చేయాలని వాళ్లంతా ఆలోచించుకుంటున్నారు అని అన్నారు.