Skip to main content

Namaste NRI

ధమాకా కాంబినేషన్ రిపీట్.. రవితేజ, శ్రీలీల మూవీ ప్రారంభం

రవితేజ 75వ సినిమా షూటింగ్‌ పూజాకార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది. శ్రీలీల ఇందులో కథానాయిక. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రొడక్షన్‌ నంబర్‌ 28 గా మొదలైన ఈ చిత్రం ద్వారా యువరచయిత భాను భోగవరపు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ముహూర్తపు సన్నివేశానికి శ్రీలీల క్లాప్‌ కొట్టగా, భాను భోగవర పు దర్శకత్వం వహించారు. ఇందులో రవితేజ హాస్యంతో కూడిన మాస్‌ పాత్రలో కనిపించనున్నారని, వినోదం తో కూడిన పూర్తి మాస్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందనున్నదని చిత్రం బృందం వెల్లడించింది. వచ్చే సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్రానికి కెమెరా: విధు అయ్యన్న, మాటలు: నందు సవిరిగాన, సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో, కూర్పు: నవీన్‌ నూలి.

Social Share Spread Message

Latest News