Skip to main content

Namaste NRI

సినిమా రంగంలో సవాళ్లు నేపథ్యంగా ఇట్లు…మీ సినిమా

సినిమాపై ప్రేమతో అవకాశాలకోసం సినీరంగానికి వచ్చిన నలుగురు యువకులు సినీలోకంలో ఎదుర్కొన్న సవాళ్లే ప్రధానాంశంగా రూపొందిన చిత్రం ఇట్లు.. మీ సినిమా. అభిరామ్‌, వెన్నెల, మనోహర్‌, పవన్‌, కృష్ణ, మంజుల ప్రధాన పాత్రధారులు. హరీశ్‌ చావా దర్శకుడు. నోరి నాగప్రసాద్‌ నిర్మాత.  ఈ సందర్భంగా ట్రైలర్‌ విడుదల కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు.

ఈ కార్యక్రామానికి అతిథులుగా  దర్శకులు రేలంగి నరసింహారావు, వి.సముద్ర, దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్‌, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, టి.ప్రసన్నకుమార్‌, రచయిత నాగబాల సురేశ్‌ విచ్చేసి చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు అందించారు. అన్ని ఎమోషన్సూ ఉన్న ఈ సినిమా అందరికీ నచ్చుతుందని దర్శకుడు చెప్పారు. ఈ నెల 21న సినిమా విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News