దక్షిణ కొరియాకు రష్యా అధ్యక్షుడు పుతిన్ వార్నింగ్ ఇచ్చారు. రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఒకవేళ ఉక్రెయిన్‌కు దక్షిణ కొరియా మద్దతు ఇస్తే అది పెద్ద తప్పు అవుతుందని పుతిన్ తెలిపారు. రష్యా, ఉత్తర కొరియా మధ్య స్నేహం కుదరడంతో, ఇటీవల దక్షిణ కొరియా ఈ అంశంపై మాట్లాడినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేయాలని దక్షిణ కొరియా నిర్ణయిస్తే, అప్పుడు తాము తీసుకోబోయే నిర్ణయాలు కొరియాను ఇబ్బంది పెడుతాయని పుతిన్ తెలిపారు. అమెరికా, దాని మిత్రదేశాలు ఒకవేళ ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా కొనసాగిస్తే అప్పుడు తాము ఉత్తర కొరియాకు ఆయుధాలు సరఫరా చేయనున్నట్లు చెప్పారు.