సాధారణంగా 12 ఏండ్లు అంటే ఏడో తరగతో, ఎనిమిదో తరగతో చదువుతుంటారు. కానీ. భారత సంతతికి చెందిన సుబోర్ణో ఇసాక్ బరీ మాత్రం అమెరికాలో గ్రాడ్యుయేట్ అయ్యాడు. పైగా కాలేజీ విద్యార్థులకు పాఠాలు చెబుతూ ప్రపంచంలోనే అత్యంత పిన్న వయసు ప్రొఫెసర్‌గా పేరుగాంచాడు. ఈ బాలుడు వచ్చే వారం యూఎస్ హైస్కూల్ నుంచి అతి చిన్న వయసులో గ్రాడ్యుయేట్ పట్టా పొందబోతూ చరిత్రను లిఖించబోతు న్నాడు. అనంతరం పూర్తి స్కాలర్‌షిప్‌తో గణితం, ఫిజిక్స్‌లో న్యూయార్క్ వర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించనున్నాడు.