Namaste NRI

రామ్‌చరణ్‌.. గేమ్‌చేంజర్‌ని ముగించారు

రామ్‌చరణ్‌ కథానాయకుడిగా రూపొందుతోన్న చిత్రం గేమ్‌చేంజర్‌. శంకర్‌ దర్శకత్వం. ఈ సినిమాలో ఆయన తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్న విషయం తెలిసిందే. తండ్రి పాత్ర పేరు అప్పన్న కాగా, కొడుకు పాత్ర పేరు రామ్‌నందన్‌ అని తెలుస్తున్నది. అప్పన్న పాత్ర పొలిటికల్‌ నేపథ్యంలో సాగితే, కొడుకు రామ్‌నందన్‌ పాత్ర లా అండ్‌ ఆర్డర్‌ నేపథ్యంలో సాగుతుందని సమాచారం. ఈ రెండు పాత్రలకూ జోడీలుగా అంజలి, కైరా అద్వానీ నటిస్తున్నారు. ఇదిలావుంటే ఈ సినిమాకోసం చాలాకాలంగా ఒకే లుక్‌ని మెయింటెన్‌ చేస్తూ వచ్చారు రామ్‌చరణ్‌. ఎట్టకేలకు ఈ శనివారంతో గేమ్‌చేంజర్‌ సినిమాకు సంబంధించిన రామ్‌చరణ్‌ వర్క్‌ కంప్లీట్‌ అయ్యిందని విశ్వసనీయ సమాచారం.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events