Namaste NRI

అమెరికాలో నలుగురు తెలుగువారు అరెస్టు

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో మానవ అక్రమ రవాణా రాకెట్‌ను నడుపుతున్న ఒక మహిళతోసహా నలుగురు భారతీయ-అమెరికన్లను పోలీసులు అరెస్టు చేశారు. అక్రమంగా భారత్ నుంచి రవాణా చేసినట్లుగా అనుమాని స్తున్న 15 మంది మహిళలు లభించినట్లు ప్రిన్స్‌టన్ పోలీసు శాఖ తమ దర్యాప్తు వివరాలను వెల్లడించింది. మార్చిలో అరెస్టు చేసిన చందన్ దాసిరెడ్డి(24), ద్వారకా గుండా(31), సంతోష్ కట్కూరి(31), అనీల్ మాలె(37)పై మానవ అక్రమ రవాణాకు పాల్పడినట్లు తాజాగా అభియోగాలను పోలీసులు నమోదు చేశారు.

ఒకే ఇంట్లో ప్రిన్స్‌టన్ లోని కొల్లిన్ కౌంటీలోగల గిన్స్‌బోర్గ్ లేన్‌లోని ఒక ఇంట్లో నేల మీదనే బలవంతంగా నిద్రి స్తున్న 15 మంది యువతులను పోలీసులు కనుగొన్నారు. ఆ ఇంట్లో ఫర్నీచర్ ఏదీ లేదని, కంప్యూటర్లు, లాప్‌ టాప్‌లు తదితర ఎలెక్ట్రానిక్ వస్తువులతో.పాటు దుప్పట్లు మాత్రం ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఒక పెస్ట్ (చెదలు) కంట్రోల్ కంపెనీ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆ ఇంటిపై పోలీసులు దాడి జరిపి సోదాలు చేయడంతో ఈ మానవ అక్రమ రవాణా వ్యవహారం బయటపడింది.

పెస్ట్ కంట్రోల్ కంపెనీకి చెందిన ఒక ఇన్‌స్పెక్టర్ ఆ ఇంటికి వెళ్లగా ఒక్కో రూములో ముగ్గురు నుంచి ఐదుమంది మహిళలు నేలమీద పడుకుని నిద్రించడాన్ని చూశారు. పెద్ద సంఖ్యలో సూట్‌కేసులు ఉండడాన్ని కూడా ఆయన గమనించారు. వెంటనే ఆయన పోలీసులకు సమాచారం అందచేశారు. మార్చి 13న ప్రిన్స్‌టన్ పోలీసు శాఖ తన అధికారులను సంతోష్ కట్కూరీ ఇంటికి వారెంట్‌తోసహా వెళ్లారు. ఆ ఇంట్లో కనిపించిన 15 మంది యువతులను ప్రశ్నించగా కట్కూరీకి చెందిన అనేక డొల్ల కంపెనీలలో పనిచేస్తున్నట్లు వారు చెప్పారు.

ఆ కంపెనీలకు కట్కూరీతోపాటు ఆయన భార్య ద్వారకా గుండా యజమానిగా ఉన్నారని పోలీసులు తెలిపారు. ఆ ఇంట్లో నుంచి అనేక లాప్‌టాప్‌లు, సెల్ ఫోన్లు, ప్రింటర్లు, నకిలీ డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసు కున్నారు. ప్రిన్స్‌టన్, మెలిస్సా, మెక్ కిన్నే తదితర అనేక ప్రదేశాలలో ఆ యువతుల చేత బలవంతంగా పని చేయిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. మరో 100 మందికి పైగా ఈ రాకెట్‌లో ఉన్నారని, వారిలో సగం మంది బాధితులు ఉండవచ్చని ప్రిన్స్‌టన్ పోలీసు సార్టెంట్ కారోలిన్ క్రాఫోర్డ్ తెలిపారు. అయితే భారత్ నుంచి అక్రమంగా రవాణా చేసి తీసుకువచ్చిన ఆ యువతుల చేత బలవంతంగా ఎటువంటి పనులు చేయి స్తున్నదీ పోలీసులు వెల్లడించలేదు. దీంతో నలుగురిపై అరెస్టు వారెంట్ జారీ చేశారు. దీంతో వారిపై హ్యూమ న్‌ ట్రాఫికింగ్‌, గృహ నిర్బంధం తదితర కేసులు నమోదు చేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events