యువ హీరో విశ్వక్‌సేన్ మెకానిక్ రాకీ గా ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ద్వారా రవితేజ ముళ్లపూడి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. రామ్ తాళ్లూరి నిర్మాత. ఈ సందర్భంగా విడుదల చేసిన కొత్త పోస్టర్‌లో విశ్వక్‌సేన్ ఓ చేతిలో గన్, మరో చేతిలో మెకానిక్ రెంచ్ పట్టుకొని మాస్ అవతారంలో కనిపిస్తున్నారు. ఆయన్ని సరికొత్త పంథాలో ఆవిష్కరించే మాస్ యాక్షన్ చిత్రమిదని దర్శకుడు తెలిపారు. మీనాక్షి చౌదరి, నరేష్, వైవా హర్ష తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతాన్నందిస్తున్నారు. రచన-దర్శకత్వం: రవితేజ ముళ్లపూడి.