రిపబ్లికన్ సదస్సు చివరి రోజు పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. దేవుడి ఆశీస్సుల వల్లే ఈ రోజు మీముందు నిలబడగలిగానంటూ తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడారు. ఏమాత్రం పొరపాటు జరిగినా తాను ఈరోజు ఇక్కడ ఉండేవాడిని కాదన్నారు. అధ్యక్ష అభ్యర్థిగా ఆయన్ని ఎన్నుకున్న పార్టీ నిర్ణయాన్ని ట్రంప్ అధికారికంగా అంగీకరించారు. అనంతరం మాట్లాడుతూ వచ్చే నాలుగే ళ్లు అమెరికా చరిత్రలో నిలిచిపోతాయన్నారు. సువర్ణాధ్యాయం ప్రారంభం కాబోతోందన్నారు. ఎలాంటి అడ్డంకులు ఎదురైనా అమెరికాను తిరిగి గొప్ప దేశంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.