ఆస్ట్రేలియాలో జలపాతం వద్ద ప్రమాదవశాత్తు నీట మునిగి ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందారు. ఆస్ట్రేలియాలో ఉన్నత విద్యాభ్యాసం కోసం వెళ్లిన ఇద్దరు విద్యార్థులు క్వీన్స్‌ల్యాండ్‌లోని మిల్లా మిల్లా జలపాతం వద్ద నీటమునిగి మృతి చెందారు. వారిని ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లాకు చెందిన చైతన్య ముప్పరాజు, ప్రకాశం జిల్లాకు చెందిన సూర్య తేజ బొబ్బగా గుర్తించారు. వారితో పాటు ఉన్న మరో విద్యార్థి షాక్‌లో ఉండటంతో అతని నుంచి వివరాలేవీ తెలియరాలేదు. వారిద్దరి మృతదేహాలు నీటిలో గల్లంతయ్యా యని, వాటి కోసం గాలిస్తున్నట్టు క్వీన్స్‌ల్యాండ్ పోలీసులు తెలిపారు. కాగా, అంత్యక్రియలు, మృతదేహాల తరలింపునకు అయ్యే ఖర్చు కోసం స్నేహితులు ఆన్‌లైన్‌లో విరాళాల సేకరణ చేపట్టారు.