టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ నటిస్తోన్న సినిమాల్లో ఒకటి ప్రాజెక్ట్ మట్కా. కరుణకుమార్ దర్శకత్వం. ఈ మూవీని వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. తాజాగా చిత్రీకరణకు సంబంధించిన వార్తను షేర్ చేశారు మేకర్స్. ఆర్‌ఎఫ్‌సీ షెడ్యూల్ పూర్తయింది. ప్రస్తుతం వైజాగ్ షెడ్యూల్ జెట్ స్పీడ్‌లో కొనసాగుతోంది. త్వరలోనే మరిన్ని ఎక్జయిటింగ్ అప్‌డేట్స్ రాబోతున్నాయని తెలియజేస్తూ, నోరాపతేహి లుక్ విడుదల చేశారు. తాజా లుక్ సాంగ్ షూట్‌కు సంబంధించినదని అర్థమవుతోంది. ఇప్పటికే విడుదల చేసిన మట్కా టైటిల్ టీజర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతూ సూపర్ బజ్ క్రియేట్ చేస్తోంది. వరుణ్ తేజ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో పీరియాడిక్ బ్యాక్ డ్రాప్‌లో సాగే కథ నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ నాలుగు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించబోతున్నాడని టాక్.