తర భర్త జె.డి.వాన్స్ అమెరికాకు గొప్ప ఉపాధ్యక్షుడు అవుతారని ఆయన భార్య, తెలుగు మూలాలున్న భారతీయ అమెరికన్ ఉషా చిలుకూరి తెలిపారు. మిల్వాకీలో రిపబ్లికన్ పార్టీ జాతీయ సదస్సుకు, అమెరికా పౌరులకు ఆయన్ని ఆమె లాంఛనంగా పరిచయం చేశారు. ఆయన భారతీయ వంటకాలను వండగలరని తెలిపారు. మొదట మేం స్నేహితులం. వాన్స్ చాలా ఆసక్తికరమైన వ్యక్తి. చిన్నప్పటి కష్టాలు అధిగమించి జీవితంలో పైకెదిగారు. నా శాకాహార అలవాట్లను ఆమోదించడమే కాకుండా నా తల్లి నుంచి భారతీయ వంటకాలు నేర్చుకున్నారు. మేం స్నేహితులుగా ప్రయాణం మొదలుపెట్టాం. అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడూ అలానే ఉన్నారు. తీరిక వేళల్లో కుక్కపిల్లతో కాలక్షేపం చేస్తారు అని ఉషా చెప్పి మురిసిపోయారు. తన వ్యక్తిగత, ఆధ్యాత్మిక జీవితంపై ఉషా ప్రభావం చాలా ఉందని, అందమైన అర్ధాంగిని తానెంతో ప్రేమిస్తా నని వాన్స్ తన ప్రనంగంలో పేర్కొన్నారు.