నాని కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ సరిపోదా శనివారం. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్. వివేక్ ఆత్రేయ దర్శకత్వం. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రచారపర్వంలో వేగాన్ని పెంచారు. ఇందులో ఎస్‌జే సూర్య కీలక పాత్రను పోషిస్తున్నారు. శనివారం ఆయన బర్త్‌డే సందర్భంగా నాట్ ఏ టీజర్ పేరుతో స్పెషల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. చెడు బలపడినప్పుడు దానిని అంతం చేసే పవర్ పుడుతుందనే వాయిస్ ఓవర్‌తో గ్లింప్స్ ఆసక్తిగా మొదలైంది. నెగెటివ్ ఛాయలున్న పోలీస్ అధికారి పాత్రలో సూర్య పరిచయమయ్యాడు. శనివారం మాత్రమే అదను చూసు కొని తన శత్రువులను అంతమొందించే వ్యక్తిగా నాని పాత్ర కొత్త పంథాలో ఉంటుందని చిత్ర బృందం పేర్కొం ది. సాయికుమార్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతాన్నందిస్తున్నారు. ఆగస్ట్ 29న విడుదల కానుంది.