అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం ప్రకటించారు. ఇటీవలే తనపై దాడి జరిగిన పెన్సిల్వేనియాలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ ర్యాలీ కోసం తాను బట్లర్ కు తిరిగి వెళ్తున్నట్లు తెలిపారు.ఇటీవలే నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహించ బోతున్నాను. నేను మా ప్రియమైన ఫైర్‌ఫైటర్ కోరే గౌరవార్థం ఆయన్ని స్మరించుకుంటూ భారీ ర్యాలీ చేపట్ట బోతున్నా. ఇందుకోసం పెన్సిల్వేనియాలోని బట్లర్‌కు తిరిగి వెళ్తున్నాను. ఈ ర్యాలీకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తా. వివరాల కోసం వేచి ఉండండి అని ట్రంప్ పేర్కొన్నారు.
జూలై 13న అమెరికాలోని పెన్సిల్వేనియాలో చేపట్టిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ట్రంప్‌పై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఓ ఆగంతకుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆయన తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు.