Skip to main content

Namaste NRI

సీఎం చంద్రబాబును కలిసిన తానా ప్రతినిధుల  బృందం

ఆంధ్రప్రదేశ్‌ నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును తానా ప్రతినిధులు కలిశారు. వెలగపూడిలోని సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల్లో  టీడీపీ విజయం కోసం పనిచేసిన ప్రవాసాంధ్రులను ఈ సందర్భంగా చంద్రబాబు అభినందించారు. అమెరికాలో తెలుగు సంఘాల శక్తి సామర్థ్యాల్ని విరివిగా వినియోగించగలిగే ఒక సమగ్ర నివేదికను రూపొందించేందుకు ప్రభుత్వం సంసిద్ధమై ఉందని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో తానా అధ్యక్షుడు నిరంజన్‌ శృంగవరపు, మాజీ అధ్యక్షుడు జయశేఖర్‌ తాళ్లూరి, తానా చికాగో తెలుగు సంఘం ప్రతినిధి రవిచంద్ర అనుమాల, తానా న్యూయార్క్‌ ప్రతినిధి వంశీ వాసిరెడ్డి పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News