Skip to main content

Namaste NRI

క‌ళ్యాణ్ రామ్ బ‌ర్త్ డే స‌ర్‌ప్రైజ్‌ .. వెంకీ-అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ నుండి ఫస్ట్‌లుక్ రిలీజ్

విక్టరీ వెంకటేశ్‌, కల్యాణ్‌రామ్‌ హీరోలుగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఓ మ్యాసీవ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ రూపొందుతున్న విషయం తెలిసిందే. కీర్తి సురేశ్‌, కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తున్న ఈచిత్రాన్ని షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతున్నది. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానున్నది.

హీరో కల్యాణ్‌రామ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాలోని ఆయన ఫస్ట్‌లుక్‌ని మేకర్స్‌ విడుదల చేశారు. తెల్లటి పంచె, కుర్తా ధరించి మెడలో పూలదండతో, ైస్టెలిష్‌ సన్‌ గ్లాసెస్‌ పెట్టుకొని డ్యాన్స్‌ చేస్తూ ఉత్సాహంగా ఓ పండుగ వాతావరణంలో కనిపిస్తున్న కల్యాణ్‌రామ్‌ని ఈ ఫస్ట్‌లుక్‌లో చూడొచ్చు. రంగురంగుల పూలతోరణాలతో అందంగా అలంకరించిన సంప్రదాయబద్ధమైన ఇల్లు, ఆ ఇంట్లో కల్యాణ్‌రామ్‌తో కలిసి ఆడిపాడుతున్న మహిళలు, నిజంగా ఈ ఫస్ట్‌లుక్‌ ఓ ఫెస్టివల్‌ మూడ్‌ని తలపిస్తున్నది. ఈ చిత్రానికి కెమెరా: సమీర్‌రెడ్డి, సంగీతం: జీవి ప్రకాశ్‌కుమార్‌, సమర్పకులు: సురేష్‌ ప్రొడక్షన్స్‌, జీ స్టూడియోస్‌, శ్రీమతి అర్చన.

Social Share Spread Message

Latest News