పవన్‌కుమార్ కొత్తూరి స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించి, బిషాలి గోయల్‌తో కలిసి నిర్మించిన చిత్రం యావరేజ్ స్టూడెంట్ నాని. స్నేహ మాల్వియ, సాహిబా భాసిన్ కథానాయికలు. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. రొమాంటిక్, యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కించామని, అన్ని వర్గాల ప్రేక్షకులూ మెచ్చేలా సినిమా ఉంటుందని పవన్‌కుమార్ కొత్తూరి చెబుతు న్నారు. టీజర్ యుతరాన్ని టార్గెట్ చేసేలా ఉంది. వివియా సంత్, ఝాన్సీ, రాజీవ్ కనకాల తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఆగస్ట్ 2న సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: సజీష్ రాజేంద్రన్, సంగీతం: కార్తీక్ బి.కొడకండ్ల.