Namaste NRI

అమెరికాలో తీవ్ర విషాదం..మరో తెలుగు యువకుడు మృతి

అమెరికాలో మరో తెలుగు యువకుడు మరణించాడు. వీకెండ్‌ కావడంతో ఈతకు వెళ్లిన అక్షిత్‌ రెడ్డి చెరువులో మునిగి మృతిచెందాడు. గత శనివారం ఈ ఘటన జరగ్గా,  అతని మృతదేహం నిన్న హైదరాబాద్‌కు చేరు కుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. మహబూబ్‌నగర్‌ జిల్లా అడ్డాకు లకు చెందిన గోపాల్‌రెడ్డి డీసీఎం డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు అక్షిత్‌ రెడ్డి (26) ఉన్నారు. పిల్లల చదువుల నిమిత్తం 25 ఏళ్ల క్రితమే హైదరాబాద్‌కు వచ్చిన గోపాల్‌ రెడ్డి ఫ్యామిలీతో కాటేదాన్‌లో సెటిల్‌ అయ్యారు. కొన్నేళ్ల క్రితమే ఇద్దరు కుమార్తెల పెళ్లిళ్లు చేశాడు. కుమారుడిని ఉన్నత చదువుల కోసం మూడేళ్ల క్రితం అమెరికా పంపించారు. చికాగోలో ఎంఎస్‌ పూర్తి చేసిన అక్షిత్‌ రెడ్డి అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు.

ఉద్యోగం కూడా చేస్తుండటంతో అక్షిత్‌ రెడ్డికి పెళ్లి చేయాలని అతని తండ్రి గోపాల్ రెడ్డి అనుకున్నాడు. దీంతో అక్షిత్‌ రెడ్డి రెండు నెలల్లో ఇండియాకు వచ్చేలా ఏర్పాట్లు చేసుకున్నాడు. ఈ క్రమంలో వీకెండ్‌ కావడంతో గత శనివారం ( జూలై 21వ తేదీన) ఇద్దరు స్నేహితులతో కలిసి చికాగోలోని లేక్‌మిశిగన్‌లో ఈతకు వెళ్లారు. ఈ క్రమంలో ఒకరు ఒడ్డున ఉండగా మరో ఇద్దరు చెరువులోకి దిగారు. చెరువు మధ్యలోని ఓ రాయి వద్దకు వెళ్లాల ని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఒక స్నేహితుడు రాయి వద్దకు చేరుకున్నాడు. కానీ అక్షిత్‌ రెడ్డి మధ్య లోనే అలసిపోయి వెనక్కి తిరిగాడు. ఈ క్రమంలో వెనక్కి వస్తున్న సమయంలో ఇద్దరు మునిగిపోయారు. ఇది గమనించిన స్థానికులు ఒకర్ని కాపాడారు. అక్షిత్‌ రెడ్డి మాత్రం చెరువులోనే గల్లంతయ్యాడు. దీంతో సమాచా రం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని చెరువంతా గాలించారు. శనివారం రాత్రి వరకు అక్షిత్ రెడ్డి మృతదేహాన్ని కనుగొన్నారు. కాగా, అక్షిత్‌ రెడ్డి మృతదేహం వారం రోజుల తర్వాత,  అనగా ఆదివారం ( జూలై 28వ తేదీన) అమెరికా నుంచి హైదరాబాద్‌కు చేరుకుంది. దీంతో అతని అంత్యక్రియలను స్వగ్రామమైన అడ్డాకులలో ఆదివారమే పూర్తిచేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events