Skip to main content

Namaste NRI

అనన్య నాగళ్ల పుట్టినరోజు సందర్భంగా.. పొట్టేల్‌ స్పెషల్‌ పోస్టర్‌ విడుదల

యువ చంద్రకృష్ణ, అనన్య నాగళ్ల జంటగా నటిస్తున్న చిత్రం పొట్టేల్‌.  సాహిత్‌ మోత్ఘూరి దర్శకుడు. నిశాంక్‌ రెడ్డి కుడితి, సురేశ్‌కుమార్‌ సడిగె నిర్మాతలు. అనన్య నాగళ్ల పుట్టినరోజు సందర్భంగా మేకర్స్‌ స్పెషల్‌ పోస్టర్‌ విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో పల్లెటూరి అమ్మాయి బుజ్జమ్మగా అనన్య చాలా నేచురల్‌ లుక్‌లో కనిపిస్తున్నది. ఇందులో నటనకు అవకాశం ఉన్న మంచి పాత్రను అనన్య పోషించిందని మేకర్స్‌ చెబుతున్నారు. అజయ్‌ పవర్‌ఫుల్‌ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంకశర్మ, తనస్వి చౌదరి, నోయల్‌సీన్‌, తదితరులు ఇతర పాత్రధారులు. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.ఈ చిత్రానికి కెమెరా: మోనిష్‌ భూపతిరాజు, సంగీతం: శేఖర్‌చంద్ర.

Social Share Spread Message

Latest News