నాసా ఇప్పుడు అంతరిక్షంలో ఒక అద్భుత నిధిని కనుగొంది. వందల కోట్ల రూపాయల విలువైన బంగారం, ప్లాటినం, ఇతర విలువైన లోహాలను అన్వేషించింది. 1852లో అన్నీబలే డి గాస్పరిస్ కనుగొన్న గ్రహశకలం16 సైకిపై 140 మైళ్ల వ్యాస పరిధిలో బంగారం, నిఖిల్, ప్లాటినం లోహాలు ఉన్నట్టు కనుగొన్నారు. అంగారక, గురు గ్రహాల మధ్య ఉన్న ఈ గ్రహ శకలంలో 100000 డాలర్ల క్వాడ్రిలియన్ విలువైన లోహాలు ఉన్నట్టు నాసా తెలిపింది.
ఈ విషయం శాస్త్రవేత్తలు, అంతరిక్ష ఔత్సాహికులను ఆశ్చర్యపరిచింది. అయితే వీటిని వెలికితీయడానికి పలు ఆర్థిక, సాంకేతిక సవాళ్లు ఎదురవుతాయని పేర్కొంటున్నది. 2029 నాటికి ఆస్టరాయిడ్‌లను చేరుకునే లక్ష్యంతో నాసా సైకి మిషన్‌ను 2023 అక్టోబర్ 13న ప్రారంభించింది. తన పరిశోధనలో భాగంగా గ్రహశకలం 16 సైకిపై అపారంగా బంగారం, ప్లాటినం, నిఖిల్ వంటి ఖరీదైన లోహాలు ఉన్నట్టు నాసా నిర్ధారించింది. అవి తవ్వి భూమి మీదకు తేగలిగితే ప్రపంచ దేశాల స్థితిగతులే మారిపోతాయని పేర్కొంటున్నది.