సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రపంచానికి అందుబాటులోకి తెచ్చిన మేధావిగా, గొప్ప దాతగా మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థా పకుడు బిల్ గేట్స్ అందరికీ సుపరిచితుడు. అయితే ఆయనలో ఓ చీకటి కోణం ఉందని త్వరలో విడుదల కానున్న పుస్తకం చెబుతున్నది. ఆయన యువతులతో అనుచిత రీతిలో ప్రవర్తించేవారని, దీంతో ఆయన నుంచి యువ ఇంటర్న్స్‌ను కాపాడటం కోసం మైక్రోసాఫ్ట్ గట్టి చర్యలు చేపట్టిందని రచయిత అనుప్రీత దాస్ ఆరోపించారు. ఆయనతో ఇంటర్న్స్ ఒంటరిగా ఉండటంపై నిషేధం విధించిందని చెప్పారు. ఈ పుస్తకం ఈ నెల 13న విడుదల కాబోతున్నది.