అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ డెమోక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిగా లాంఛనంగా ఖరార య్యారు. ఈ విధంగా దేశంలోని ప్రధాన పార్టీ నుంచి నామినేషన్ పొందిన తొలి భారతీయ అమెరికన్‌గా ఆమె గుర్తింపు పొందారు. ఈ ఏడాది నవంబరు 5న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ను ఎదుర్కొంటారు. హారిస్ నామినేషన్ అధికారికమైంది. ఆమెకు అనుకూలంగా 99 శాతం మంది పార్టీ ప్రతినిధుల ఓట్లు లభించాయి. దేశవ్యాప్తంగా సుమారు 4,567 మంది హారిస్‌ను బలపరుస్తూ ఓటేశారు.