Namaste NRI

ఆగష్టు 9న వస్తున్న పాగల్ వర్సెస్ కాదల్

విజయ్‌శంకర్‌, విషిక జంటగా రూపొందిన రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ పాగల్‌ వర్సెస్‌ కాదల్‌. రాజేశ్‌ ముదునూరి దర్శకుడు. పడ్డాన మన్మథరావు నిర్మాత. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీరిలీజ్‌ ప్రెస్‌మీట్‌ జరిగింది. ఇందులో తాను ప్రేయసితో ఇబ్బందులు పడే ఇన్నోసెంట్‌ అబ్బాయి కార్తీక్‌గా కనిపిస్తానని, ప్రతి ప్రేమికుడుకీ రిలేట్‌ అయ్యాలా ఈ కథ ఉంటుందని హీరో విజయ్‌శంకర్‌ తెలిపారు. ఇందులో తన పాత్ర పేరు ప్రియ అని, బాయ్‌ఫ్రెండ్‌ని ఎప్పుడూ అనుమానిస్తూ ఇబ్బందులు పెడుతుంటానని, అందరికీ నచ్చేలా సినిమా ఉంటుదని కథానాయిక విషిక చెప్పారు. బ్రహ్మాజీ, షకలకశంకర్‌ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఈ నెల 9న సినిమా విడుదల కానుంది.  ఈ చిత్రానికి కెమెరా: నవధీర్‌, సంగీతం: ప్రవీణ్‌ సంగడాల, నిర్మాణం: శివత్రి ఫిలింస్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress