అంతర్జాతీయ పెట్టుబడులు, నిపుణులను ఆకర్షించేందుకు యూఏఈ ప్రభుత్వం ఇస్తున్న గోల్డెన్ వీసాలకు భారత్‌లో క్రేజ్ పెరుగుతున్నది. ఆర్థికంగా, వృత్తిపరంగా ఎదిగేందుకు కొత్త అవకాశాలను వెతుక్కుంటూ యూఏఈ గోల్డెన్ వీసా కోసం ప్రయత్నిస్తున్న భారతీయుల సంఖ్య ఎక్కువవుతున్నది. వివిధ రంగాల్లో నిపుణు లు, పెట్టుబడులు పెట్టగలిగిన వారికి యూఏఈ రెడ్ కార్పెట్ పరిచి మరీ స్వాగతిస్తున్నది.
స్వయంగా వచ్చి గోల్డెన్ వీసాలను అందిస్తున్నది. దీంతో భారత్ నుంచి వెళ్లి విదేశాల్లో స్థిరపడేందుకు సిద్ధ మవుతున్న సంపన్నుల్లో చాలామందికి గమ్యస్థానంగా యూఏఈ మారుతున్నది. అంతర్జాతీయ పెట్టుబడి వలసల కన్సల్టెన్సీ సంస్థ హెన్లీ అండ్ పార్ట్‌నర్స్ జూన్ నివేదిక ప్రకారం 2024లో 4,300 మంది భారతీయ సంప న్నులు దేశం వీడనున్నారు. వీరిలో చాలామంది గోల్డెన్ వీసా తీసుకొని యూఏఈలో స్థిరపడేందుకు మొగ్గు చూపుతున్నారు.