Skip to main content

Namaste NRI

8 వసంతాలు పూర్తి కావస్తున్న షూటింగ్

అనంతిక, సనీల్‌కుమార్‌ నటిస్తున్న తాజా చిత్రం 8వసంతాలు. ఫణీంద్ర నర్సెట్టి దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తున్నది. ఈ సినిమా షూటింగ్‌ పూర్తికావొస్తున్నదని, వినూత్నమైన కాన్సెప్ట్‌తో రూపొందిస్తు న్నామని మేకర్స్‌ తెలిపారు. కొద్దిరోజుల కిత్రం విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ ప్రేక్షకుల్లో ఆసక్తినిరేకెత్తించిం ది. హైదరాబాద్‌, ఊటీ, కన్యాకుమారి ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపాం. తదుపరి షెడ్యూల్‌ను కశ్మీర్‌, ఆగ్రా, వార ణాసిలో జరుపబోతున్నాం అని చిత్రబృందం పేర్కొంది. హనురెడ్డి, రవితేజ దుగ్గిరాల, సంజన తదితరులు నటిస్తు న్న ఈ చిత్రానికి సంగీతం: హేషమ్‌ అబ్దుల్‌ వహాబ్‌, నిర్మాతలు: నవీయ్‌ యెర్నేని, వై.రవిశంకర్‌, రచన-దర్శకత్వం: ఫణీంద్ర నర్సెట్టి.

Social Share Spread Message

Latest News