బాలీవుడ్ ప్రముఖ జోడీ కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. తాము రెండో బిడ్డ కోసం ఎదురుచూస్తున్నట్లు ఈ జంట ప్రకటించింది. గతంలో 2025లో వీరికి మొదటి సంతానంగా కూతురు సారాయ్ జన్మించిన విషయం తెలిసిందే.

తమ జీవితంలోకి మరో చిన్నారి రాబోతున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ దంపతులు. మరోసారి దేవుడు మాకు అత్యంత గొప్ప బహుమతిని ప్రసాదించాడు. మా హృదయాలు ప్రేమ, కృతజ్ఞతలతో నిండిపోయాయి అని రాసుకొచ్చారు. ఈ గుడ్ న్యూస్ తెలిసిన వెంటనే సినీ పరిశ్రమలోని ప్రముఖులు, స్నేహితులు వారికి శుభాకాంక్షలు తెలిపారు.















