Skip to main content

Namaste NRI

ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన క్రీడాకారులను అభినందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

ఇటీవల జపాన్ లో జరిగిన ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన క్రీడాకారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. రాష్ట్రం నుండి ఎక్కువ మంది క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించి పతకాలు సాధించేలా ప్రోత్సాహం అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

2026 ఆసియా క్రీడల్లో విశేష ప్రతిభ కనబరిచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఖ్యాతి తెచ్చిపెట్టిన క్రీడాకారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. క్రీడాకారులు శ్రీ చరణి, గణేష్ మణిరత్నం, ధీరజ్ బొమ్మదేవర, వెన్నం జ్యోతిసురేఖ సచివాలయంలో సీఎంను కలిశారు. క్రీడాకారులు సాధించిన పతకాలు చూసి, వారి అత్యుత్తమ ప్రదర్శనను సీఎం కొనియాడారు. మొత్తంగా 3 రకాల క్రీడాంశాల్లో 3 స్వర్ణాలు, 2 రజతాలు, 3 కాంస్యాలతో సహా మొత్తం 8 పతకాలను మన రాష్ట్ర క్రీడాకారులు కైవసం చేసుకున్నారని సీఎంకు శాప్ ఎండీ శ్రీమతి భరణి వివరించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events