Namaste NRI

సారంగపాణి జాతకం ఎలా వుందో తెలుసా?

శ్రీదేవి మూవీస్‌ అధినేత శివలెంక కృష్ణప్రసాద్‌, దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్‌లో,  ప్రియ దర్శి కథానాయకుడిగా ఓ చిత్రం రూపొందుతున్నది. రూప కొడువాయూర్‌ కథానాయిక. ఈ సినిమాకు సారంగ పాణి జాతకం అనే టైటిల్‌ ఖరారు చేయగా, ఈ టైటిల్‌తోపాటు ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని మేకర్స్‌ విడుదల చేశారు. మనిషి భవిష్యత్తు అతని చేతి రేఖల్లో ఉంటుందా? లేక అతని చేతల్లో ఉంటుందా? అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చే పరిపూర్ణ హాస్యరసచిత్రమిది. ఇంద్రగంటి అద్భుతమైన కథ రాసుకున్నారు. సాంకేతికంగా సినిమా ఉన్నత స్థాయిలో ఉంటుంది. 90శాతం చిత్రీకరణ పూర్తయింది. నేటి నుంచి సెప్టెంబర్‌ 5 వరకు జరిగే షూటింగ్‌ లో రెండు పాటలు, మిగతా సన్నివేశాలు చిత్రీకరిస్తాం. దీంతో షూటింగ్‌ కంప్లీట్‌ అవుతుంది అని శివలెంక కృష్ణప్రసాద్‌ తెలిపారు.

ఇంద్రగంటి మోహనకృష్ణ మాట్లాడుతూ నమ్మకం మనిషికి బలాన్నిస్తుంది. మూఢనమ్మకం బుద్ధిహీనుడ్ని చేస్తుంది. అలా నవ్వులపాలైన ఓ మధ్యతరగతి మంచి అబ్బాయి కథే మా ‘సారంగపాణి జాతకం. వినోదంతో పాటు భావోద్వేగాలను కూడా ప్రియదర్శి చక్కగా పండించాడు. కుటుంబసమేతంగా చూడాల్సిన సినిమా ఇది అని పేర్కొన్నారు. ఈ చిత్రంలో నరేశ్‌, తనికెళ్లభరణి, అవసరాల శ్రీనివాస్‌, వెన్నెల కిశోర్‌, వైవా హర్ష తదితరు లు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: పీజీ విందా, సంగీతం: వివేక్‌ సాగర్‌.

Social Share Spread Message

Latest News