Namaste NRI

జెలెన్‌స్కీకి మరోసారి ఎదురుదెబ్బ

ఉక్రెయిన్‌కు భారీ జ‌ల‌క్ త‌గిలింది. అమెరికా పంపిన ఎఫ్‌-16 యుద్ధ విమానాన్ని ర‌ష్యా కూల్చివేసింది. ఎఫ్‌16 కూలిన విష‌యాన్ని ఉక్రెయిన్ అంగీక‌రించింది.  రెండు దేశాల మ‌ధ్య భీక‌ర దాడి జ‌రిగిన విష‌యం తెలిసిందే. అయితే ఆ స‌మ‌యంలో ర‌ష్యాకు చెందిన పాట్రియాట్ యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ మిస్సైల్ వ్య‌వ‌స్థ ఆ యుద్ధ విమానాన్ని కూల్చివేసిన‌ట్లు తెలుస్తోంది. ఎఫ్‌-16 యుద్ధ విమానాన్ని నాటో ద‌ళాలు, ఉక్రెయిన్‌కు ఇటీవ‌లే అంద‌జేశాయి. వాస్త‌వానికి ఆ యుద్ధ విమానం అమెరికా త‌యారు చేస్తున్న‌ది. ర‌ష్యా వంద‌ల సంఖ్య‌లో మిస్సై ళ్లు, డ్రోన్ల‌తో దాడి చేసింది. ఆ స‌మ‌యంలో ఎఫ్‌-16 యుద్ధ విమానం నేల కూలిన‌ట్లు ఉక్రెయిన్ ఎంపీ మారియా నా బెజుగ‌యా తెలిపారు.

శుత్ర‌వులు చేసిన మిస్సైల్ దాడిలో ఎఫ్‌-16 యుద్ధ విమానం కూలిన‌ట్లు ఉక్రెయిన్ మొద‌ట అంగీక‌రించ‌ లేదు. కానీ ఆ యుద్ధ విమాన పైలెట్, నేల కూల‌డానికి ముందు మూడు ర‌ష్య‌న్ క్రూయిజ్ మిస్సైళ్ల‌ను, ఓ డ్రోన్‌ను కూల్చివేసిన‌ట్లు తెలుస్తోంది. భీక‌ర‌మైన ర‌ష్యా మిస్సైళ్ల దాడి నుంచి ఉక్రెయిన్ల‌ను పైలెట్ ఒలెసీ కాపాడిన‌ట్లు ఉక్రెయిన్ వైమానిక ద‌ళం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీ ఈ ఘ‌ట‌న ప‌ట్ల ప్ర‌క‌ట‌న చేశారు. ర‌ష్యా డ్రోన్లు, మిస్సైళ్ల‌ను కౌంట‌ర్ చేసేందుకు అమెరికాలో త‌యారైన ఎఫ్‌-16 విమానాలు వాడిన‌ట్లు జెలెన్‌స్కీ చెప్పారు. ఎఫ్‌-16 యుద్ధ విమానం కూలిపోవ‌డ, అధ్య‌క్షుడు జెలెన్‌స్కీకి ఎదురుదెబ్బే అవుతుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress