డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్ సీఎన్ఎన్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూపై రిపబ్లికన్ నేత డోనాల్డ్ ట్రంప్ స్పందించారు. కమలా హ్యారిస్ ఇంటర్వ్యూ బోరింగ్‌గా ఉన్నట్లు ట్రంప్ పేర్కొన్నా రు. మీడియా వేసిన ప్రశ్నలకు ఆమె సరైన సమాధానాలు ఇవ్వలేదన్నారు. సోషల్ మీడియా ట్రుత్ ద్వారా ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. హ్యారిస్ విలువల మారలేదన్నారు. కమలా ఇచ్చిన వాగ్దానాలతో అమెరికా వేస్ట్‌ల్యాండ్‌గా మారుతుందని ఆయన ఆరోపించారు. కమలా హ్యారిస్‌తో చర్చించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ట్రంప్ తెలిపారు. మిచిగన్‌లో జరిగిన సభలోనూ ట్రంప్ మాట్లాడారు. హ్యారిస్‌ది ఫ్లాప్ షో అని విమర్శించారు.