రష్యా , ఉక్రెయిన్ యుద్ధం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. రష్యాపై దీర్ఘ శ్రేణి క్రూయిజ్ క్షిపణులతో (స్టార్మ్ షాడో క్షిపణులు) దాడికి ఉక్రెయిన్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది. ఈ క్షిపణుల వినియోగానికి ఉక్రెయిన్‌కు నాటో సభ్య దేశమైన యూకే అనుమతి ఇచ్చింది. యూకే, ఫ్రాన్స్ కలిసి అభివృద్ధి చేసిన ఈ క్షిపణులు 500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలపై కూడా దాడి చేయగలవు. ఇప్పటివరకు రష్యా, ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతాలకు ఎక్కువగా యుద్ధం పరిమితమైంది. ఈ క్షిపణుల ద్వారా రష్యా భూభాగం లోపలి ప్రాంతాల్లోని లక్ష్యాలపై దాడులు చేయాలని ఉక్రెయిన్ భావిస్తున్నది.ఇదే జరిగితే యుద్ధం తీవ్రరూపం దాల్చే అవకాశం ఉంది.