ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు మనవడు సుదర్శన్ పరుచూరి హీరోగా పరిచయమవుతున్న చిత్రం మిస్టర్ సెలబ్రిటీ. చందిన రవికిషోర్ దర్శకుడు. ఆర్‌పీ సినిమాస్ పతాకంపై చిన్న రెడ్డయ్య, ఎన్.పాండురంగా రావు నిర్మాతలు ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్టర్‌ను పరుచూరి గోపాలకృష్ణ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన మంచి కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. పరుచూరి వెంకటేశ్వర రావు మాట్లాడుతూ రచయితలుగా ప్రేక్షకులు మమ్మల్ని నలభై ఏండ్లుగా ఆదరిస్తున్నారు. ఇప్పుడు హీరోగా పరిచయమవుతున్న మా మనవడిని కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. నేటి యువత మెచ్చే కొత్త కథతో ఈ సినిమాను తెరకెక్కించారు అని చెప్పారు. వరలక్ష్మీ శరత్‌కుమార్, సుదర్శన్ పరుచూరి, శ్రీదీక్ష, నాజర్, రఘుబాబు తదితరులు నటిస్తున్నారు. అక్టోబర్ 4న విడుదలకానుంది. ఈ చిత్రానికి సంగీతం: వినోద్ యాజమాన్య, రచన-దర్శకత్వం: చందిన రవికిషోర్.