Skip to main content

Namaste NRI

అట్టహాసంగా సైమా అవార్డ్స్ వేడుకలు.. విజేతలు వీరే

సౌత్‌ ఇండస్ట్రీలో జరిగే అతి పెద్ద సినిమా పండుగ సైమా. సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ వేడుకకి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలకు చెందిన నటీనటులు హాజరవుతుంటారు. వారు ఆ వేడుకల్లో చేసే సందడిని చూసి ప్రేక్షకులు మైమరిచోతుంటారు. ఈ సారి హైదరాబాద్‌లో ఈ వేడుక నిర్వహించారు. తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన సైమా అవార్డుల వేడుక జరగగా, 2019 సంత్సరానికి సంబంధించిన విజేతలకు అవార్డులు అందించారు. మహర్షి సినిమాకు మహేష్‌ బాబు ఉత్తమ నటుడిగా ఎంపీ సంతోష్‌ కుమార్‌ నుంచి అవార్డును అందుకొన్నారు.

ఉత్తమ చిత్రం: జెర్సీ (సితార ఎంటర్‌‌టైన్‌మెంట్స్),ఉత్తమ వినోదాత్మక చిత్రం: ఎఫ్2 (శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్), ఉత్తమ దర్శకుడు: వంశీ పైడిపల్లి (మహర్షి), ఉత్తమ నటుడు: మహేష్ బాబు (మహర్షి), ఉత్తమ నటుడు (క్రిటిక్స్): నాని (జెర్సీ), ఉత్తమ నటి: సమంత (ఓ బేబీ), ఉత్తమ నటి (క్రిటిక్స్): రష్మికా మందన్న (డియర్ కామ్రేడ్), ఉత్తమ సహాయ నటుడు: అల్లరి నరేష్ (మహర్షి), ఉత్తమ సహాయ నటి: లక్ష్మీ (ఓ బేబీ), ఉత్తమ సంగీత దర్శకుడు: దేవిశ్రీ ప్రసాద్ (మహర్షి), ఉత్తమ గేయ రచయిత: శ్రీమణి(ఇదే కదా.. మహర్షి), ఉత్తమ గాయకుడు: అనురాగ్ కులకర్ణి(ఇస్మార్ట్ శంకర్-టైటిల్ సాంగ్), ఉత్తమ గాయని: చిన్మయి (మజిలీ-ప్రియతమా), ఉత్తమ విలన్: కార్తికేయ గుమ్మకొండ (నానిస్ గ్యాంగ్ లీడర్), ఉత్తమ తొలి పరిచయ హీరో: శ్రీ సింహా (మత్తు వదలరా), ఉత్తమ తొలి పరిచయ హీరోయిన్: శివాత్మిక రాజశేఖర్ (దొరసాని, ఉత్తమ తొలి పరిచయ దర్శకుడు: స్వరూప్ ఆర్ఎస్‌జె (ఏజంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ), ఉత్త తొలి పరిచయ నిర్మాత: స్టూడియో 99 (మల్లేశం), ఉత్తమ సినిమాటోగ్రాఫర్: సానూ వర్గీస్‌ (జెర్సీ), ఉత్తమ కమెడియన్: అజయ్ ఘోష్ (రాజుగారి గది 3).

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events