అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను ఆ దేశం వెనక్కి పంపింది. ఈ నెల 22న ప్రత్యేక విమానం ద్వారా వారిని భారత్‌కు పంపేశామని, నరేంద్ర మోదీ ప్రభుత్వ సహకారంతో ఈ చర్య చేపట్టామని అమెరికా ఆంతరంగిక భద్రతా శాఖ (డీహెచ్‌ఎస్) డీహెచ్‌ఎస్ సీనియర్ అధికారి క్రిస్టీ ఏ కనెగాల్లో ఒక ప్రకటనలో వెల్లడించారు. 2024 ఆర్థిక సంవత్సరంలో అమెరికా నుంచి 1.60 లక్షల మందికి పైగా అక్రమ వలసదారులను వెనక్కి పంపామని, భారత్ సహా 145 దేశాలకు చెందిన ఆ వలసదారులను 495కు పైగా ప్రత్యేక విమానాల్లో తరలించామని డీహెచ్‌ఎస్ తెలిపింది.