Namaste NRI

లాంఛనంగా ప్రారంభమైన 10 ప్రేమకథలు సినిమా

10 ప్రేమకథలు పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతున్నది. పి.సి.క్రియేషన్స్‌ సమర్పణలో మనూటైమ్స్‌ మూవీ మిషన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పదిమంది పాపులర్‌ హీరోహీరోయిన్లు నటించబోతున్నారు. మనోహర్‌ చిమ్మని దర్శకుడు. ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో లాంఛనంగా మొదలైంది. అతిథులుగా విచ్చేసిన దర్శకులు వీరశంకర్‌, చంద్రమహేశ్‌, బాబ్జీ మూవీ పోస్టర్‌పై క్లాప్‌ కొట్టి, చిత్రయూనిట్‌కి శుభాకాంక్షలు అందించారు. ఈ తరం యువతీయువకుల ఆలోచనలు, జీవనశైలి చుట్టూ అల్లిన పది ప్రేమకథల సమాహారమే ఈ సినిమా అని దర్శకుడు మనోహర్‌ చిమ్మని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: వీరేంద్ర లలిత్‌, సంగీతం: ప్రదీప్‌చంద్ర.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events